హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయన్న ఫిర్యాదుకు స్పందించిన వీరు ఆ స్థలాలను పరిశీలించేందుకు వచ్చారు. మన్సూరాబాద్, జర్నలిస్టు కాలనీ, రాక్‌టౌన్ కాలనీలోని ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లయితే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.




