Wednesday, 4 November 2026

పాదయాత్ర చేపట్టిన తెదేపా ఎమ్మెల్యే :హనుమంత్‌ షిండే

నిజాంసాగర్‌ : జుక్కల్‌ మండలంలోని పెద్ద ఎరిగి గ్రామం నుంచి జుక్కల్‌ మండల కేంద్రం వరకు జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే బుధవారం పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎరిగి నుంచి జుక్కల్‌ వరకు గల నాలుగు కిలోమీటర్ల రహదారికి మరమ్మత్తులు జరిపించాలని, వంతెన నిర్మించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్‌ సర్పంచి గంగాధర్‌, నాయకులు శివరాజ్‌ పటేల్‌, మాజీ జడ్పీటీసీ సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *