హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని అన్నారు. తెలంగాణకు సీఎం అడ్డుపడుతున్నారని ఇక్కడ కూడా ఉద్యమం మొదలవుతుందనే భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తన సమస్యలన్నింటినీ ఆంటోని కమిటీ ముందు చెప్పుకోవచ్చని సూచించారు. ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా అధిష్టానం వద్ద చెప్పుకోవాలని కోరారు.




