హైదరాబాద్: కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణ విషయంపై ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్రంతో అనేక సమస్యలు తలెత్తుతాయని, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలలో స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒక పక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సీఎంపై తెలంగాణ వ్యాప్తంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.




