హైదరాబాద్,(జనంసాక్షి): ముమ్మాటికీ తెలంగాణకు హైదరాబాదే రాజధాని … మార్పు వస్తే సహించం అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి తేల్చిచెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించకూడదు అని చెప్పారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రజలను వెళ్లిపొమ్మని ఎవరూ చెప్పలేదు అని తెలిపారు. లేని పోని అనుమానాలతో తెలుగు ప్రజలను సీమాంధ్ర నేతలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రాజధాని కట్టుకోండి…. పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.




