కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పధ క్షేత్రం వద్ద స్నానానికి దిగి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయనగరం నుంచి తిరుపతి యాత్రకు వెళ్తూ ఆదివారం ఉదయం క్షేత్రం వద్ద స్నానానికి దిగి వీరు గోదవరి ఉద్ధృతికి కొట్టుకు పోయారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టారు.




