Tuesday, 3 November 2026

బాబువి పచ్చి అబద్ధాలు : తెలంగాణవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశంలో ఎక్కడా రాజధానిగా ఉన్న ప్రాంతం రాష్ట్రంగా విడిపోలేదంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య అస్సాంకు రాజధానిగా ఉన్న షిల్లాంగ్‌ విడిపోలేదా అని ప్రశ్నించారు. అస్సాం విభజన తర్వాత మేఘాలయకు రాజధానిగా షిల్లాంగ్‌ ఏర్పడిందని తెలంగాణవాదులు గుర్తు చేశారు. అనంతరం అస్సాం డిస్‌పూర్‌ను రాజధానిగా ఏర్పాటు చేసుకుందని తెలిపారు. షిల్లాంగ్‌ కంటే డిస్‌పూర్‌ బ్రహ్మాండంగా అభివృధ్ది చెందిందని పేర్కొన్నారు. అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దారుణమని తెలంగాణవాదులు నిప్పులు చెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *