Thursday, 5 November 2026

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ములుగు: మెదక్‌ జిల్లా ములుగు మండలం సింగన్న గూడ గ్రామపంచాయతీ కార్యాక్రమం వద్ద స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. జెండా స్తంబానికి విద్యుత్‌ వైర్లు తగలడంతో విద్యుత్‌దాఘాతానికి గురై సింగన్న గ్రామానికి ,చెందిన మహేష్‌ (25), నరేష్‌(24)లు తీవ్రగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేష్‌,నరేష్‌లు మృతి చెందారు. ములుగు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *