స్థిరంగా ఉపరితలం ఆవర్తనం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళఖాతంలొ 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కోస్తాతీరాన్ని ఆనుకుని పశ్చిమ బంగాళ ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాలు రాయలసీమ, కోస్తాంధ్రలోనూ ప్రభావంతంగా ఉన్నాయి. ఈ కారణంగా శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కోంది. ప్రత్యేకించి రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్రలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణలోని ఉభయ గోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు భాకీగా వర్ష సూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.




