Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రక్రియ మొదలైంది: పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయనను కలిసిన తెలంగాణ ప్రాంత నేతలతో తెలంగాణ అంశంపై సమావేశమై చర్చించారు. ఈ మేరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని ఆయన నేతలను కోరారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *