న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద జాబితాలో ఉన్న అబ్దుల్ కరీమ్ తుండాను ఢిల్లీ పోలీసులు నిన్న రాత్రి ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం కరీంమ్‌తుండాను పోలీసులు ఢిల్లీ కోర్టులో హజరుపరిచారు. కరీమ్ తుండా ఢిల్లీ, ముంబాయితో పాటు పలు నగరాల్లో సుమారు 40 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ పేలుళ్లలో దాదాపు 21 మంది చనిపోగా 400 మంది క్షతగాత్రులయ్యారు,




