ఖైరతాబాద్ : నగరంలో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. గడ్డర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాదాచారుల వంతెనలను మెట్రో అధికారులు తొలగిస్తున్నారు. ఖైరతాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీహెచ్‌ఎంసీ నిర్మించిన పాదాచారుల వంతెనను మెట్రో అధికారులు పూర్తిగా తొలగించారు. శనివారం రాత్రి 10.40గంటల ప్రాతంలో ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై నుంచి మళ్లించిన అధికారులు తెల్లవారేసరికి మొత్తం వంతెనను తొలగించారు. బేగంపేట, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద నిర్మించిన పాదాచారుల వంతెనలు కూడా మెట్రో నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని వాటిని త్వరలో తొలగించనున్నట్లు అధికారలు వెల్లడించారు.




