Tuesday, 3 November 2026

అడవులను పెంచాల్సిన బాధ్యత మనదే : సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రోజురోజుకు అడవుల విస్తరణ శాతం తగ్గిపోతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం కండ్లకోయిలో జరిగిన 64వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అడవులను 33 శాతం పెంచాల్సిన బాధ్యత మనపైనే ఉందని స్పష్టం చేశారు. అడవుల్లో చెట్లను నాశనం చేస్తూ అడవి జంతువులను చంపే వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *