హైదరాబాద్,(జనంసాక్షి:) విద్యుత్‌సౌధ వద్ద తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలంగాణవాదులపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి ఉక్కుఆదం మోపింది. పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేసింది. ఇవాళ లంచ్ విరామ సమయంలో తెలంగాణపై సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు తెలంగాణ ఉద్యోగులు బయటకు వచ్చారు. జై తెలంగాణ నినాదాలతో భవనం వద్ద హోరెత్తించారు. ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జైసమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న పరకాల ప్రభాకర్‌ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు తెలంగాణ వాదులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.




