హైదరాబాద్: నగరంలో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ 69వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు సద్భావన పరుగు నిర్వహించారు. సోమాజిగూడ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అద్యక్షుడు బొత్ససత్యనారాయణ, వి.హపుమంతరావు, దానం నాగేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు.




