హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అగ్నిగుండమే అవుతుంది. అని మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఈ విషయమై తాను ఆంటోనీ కమిటీకి వివరిస్తానని తెలిపారు. హైదరాబాద్‌పై కేంద్రం పునరాలోచన చేస్తుంటే అనుమానాలున్నాయని పేర్కొన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల్సిందేనని నిన్న కేంద్ర మంత్రి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.




