హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నగరం తెలంగాణలో అంతర్భాగమేనని దాన్ని ఎవరూ కాదనలేదని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసమే సమైక్య ఉద్యమమని నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల వారికి అధికారం దక్కకుండా కుట్ర జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




