Thursday, 5 November 2026

కిరికిరి లేకుండా తెలంగాణ బిల్లు పెట్టండి: నాగం జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎలాంటి కిరికిరి లేకుండా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే ఇక్కడ ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అనుకూలమని చెప్పిన టీడీపీ ప్రవర్తించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *