హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర ఛానళ్లు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నిరంతరాయంగా ప్రసారం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న సద్భావన ర్యాలీలను చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నిషేధించడం దారుణమన్నారు. సీమాంధ్ర ఛానళ్ల అసలు రంగు బయటపడిందని ఫైర్ అయ్యారు.




