హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఛాంబర్లో టీ మంత్రులు భేటీ అయ్యారు. అధిష్ఠానం వద్ద సీమాంధ్ర నేతల లాబీయింగ్‌కు అడ్డుకట్ట వేసేలా టీ మంత్రులు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి తేవాలని టీ మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తుంది.




