హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే అందరికీ నష్టమే అని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని దానం స్పష్టం చేశారు.




