హైదరాబాద్: జంటనగరా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో వరుసగా మూడో ఏడాది కూడా ఎయిర్టెల్ హైదరాబాద్ మారధాన్ రన్ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన మారధాన్ రన్‌కు విశేష స్పందన లభించింది. నగరపోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ, జీహెచ్చఎంసీ కమీషనర్ కృష్ణబాబు జెండావూపి మారధాన్ రన్ ప్రారంభించారు. ఈ పరుగు గచ్చిబౌలి స్టేడియం వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందులో సగం దూరాన్ని కలుపుతూ హాఫ్ మారధాన్కూడా నిర్వహించారు. మారధాన్ విజేతలకు రూ.5లక్షల వరకు బహుమతి అందిస్తారు.




