హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ ప్రభావం నగరంలోని అన్ని కమిషనరేట్‌లను అట్టుడికిస్తుంది. ఇవాళ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్రా ఉద్యోగులు ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యోగులు జైతెలంగాణ నినాదాలు చేస్తూ కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించారు. వీరికి పోటీగా సీమాంధ్ర ఉద్యోగులు కూడా ఆందోళన చేపట్టి సమైక్య నినాదాలు చేస్తున్నారు. దీంతో కార్యాలయం ప్రాంగణం ఉధ్రిక్తత ఏర్పడింది.




