ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మందకొడి దర్యాప్తు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీంకోర్టుఆదేశించింది. 4 లేదా 5నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దస్త్రాల గల్లంతుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని సీబీఐ కేంద్రాన్ని ప్రశ్నించింది. బొగ్గు క్ష్రేత్రాల కేటాయింపు దస్త్రాల గల్లంతు అంశంపై న్యాయస్థానం కేంద్రాన్ని తప్పుపట్టింది. దస్త్రాలకు సంభందించిన వివాదం ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించగా సీబీఐకి అన్ని దస్త్రాలు ఇవ్యాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.




