హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగిపై జరిగిన దాడిపై నిజనిర్ధారణకు విద్యుత్‌సౌధకు వెళ్లిన న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ పది జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రమత్నం చేస్తున్నారని లాయర్లు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌ను సీమాంధ్రలోని ఆసుపత్రులకు తరలించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.




