Monday, 2 November 2026

మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

జమ్మూ,(జనంసాక్షి): రెండు రోజుల తర్వాత పాక్‌ బలగాలు మరోసారి నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ జిల్లాలోని పల్లన్‌వాలా సబ్‌ స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి 11.30 ప్రాంతంలో కాల్పులు జరిపిందని భరత సీనియర్‌ ఆర్మీ ఆఫీసర్‌ శుక్రవారం తెలిపారు. పాక్‌ బలగాలు కాల్పులను భారత్‌ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని ఆయన అన్నారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *