Monday, 2 November 2026

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పొంగులేటి

నల్లగొండ,(జనంసాక్షి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని  ఆయన నిప్పులు చెరిగారు. బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడానికి బదులు ఊసరవెల్లి యాత్ర చేయాలని సూచించారు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ పూటకో మాట మాట్లాడటం తగదని హెచ్చరించారు. ఉనికి కోసమే వైసీపీ, టీడీపీ యాత్రలు చేస్తున్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ మాటమార్చి దొంగ దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీక్షలు చేసినా జగన్‌ను ఎవరూ నమ్మరు అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *