Tuesday, 3 November 2026

రేపో మాపో కాంగ్రెస్‌ పతనం ఖాయం : కిషన్‌రెడ్డి

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. మందమర్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేపోమాపో కాంగ్రెస్‌ పతనవడం ఖాయమని ఆయన చెప్పారు. భారత భూభాగంలోకి చైనా, పాక్‌ దళాలు చొరబడుతున్నా ప్రధాని నిశ్చేష్ఠులుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ ప్రకటన చేసి నెల గడుస్తున్నా కేంద్రం ఎందుకు ముందడుగు వేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి ప్రాంతాన్ని కోల్‌ కారిడార్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *