శాంతిర్యాలీకి అనుమతివ్వాలి : కోదండరాం
ఆదిలాబాద్,(జనంసాక్షి): ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహిచబోయే శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వర్షకాల సమావేశాల్లోనే పార్లమెంట్ తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.