సికింద్రాబాద్: గాంధీ మెడికల్ కళాశాలో 2కే9 బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ ఫెస్ట్ వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. క్రీడా మైదానం, ఆడిటోరియంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. వక్తృత్వ పోటీలు, కథలు, ఉత్తరాలు రాయడం, పాటలు పాడటం, మెహందీ, వాలీబాల్, క్రికెట్, ముగ్గుల పోటీల్లో విద్యార్థినీ విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గోన్నారు. రాత్రి క్రీగా మైదానంలో నిర్వహించిన దాండియా కోలాహలంగా సాగింది. దాండియా పాటల కనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు.
గాంధీ కాలేజీ ఫెస్ట్‌లో విద్యార్థుల సందడి




