వినుకొండ పట్టణం: ప్రమాదవశాత్తు కాలువలోపడి రైతు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని నడిగడ్డలో జరిగింది. నడిగడ్డ గ్రామానికి చెందిన పత్తి కోటయ్య(51) ఈ రోజు ఉదయం మంచినీళ్లు తాగేందుకు కాలువ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు తూములో ఇరుక్కుని మృతి చెందాడు. మృతదేహన్ని కుటుంబసభ్యులు వెలికి తీశారు.




