గన్నవరం: 16వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఈరోజు ఉదయం లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ (40) మృతి చెందింది. మహిళపై నుంచి లారీ వెళ్లడంతో మృతదేహం గుర్తించేందుకు కూడా వీలులేకుండా ఉంది. సమాచారమందుకున్న గన్నవరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాన్తు చేసుకున్నారు.




