హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ అధ్యాపకులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వివక్ష పాటిస్తున్న బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పీబీ మెంబర్ డి.శ్రావణ్ కుమార్ డిప్యూటీ సీఎంను కోరారు. ఈ మేరకు వారు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహంను కలిసి బాసర ఐఐఐటీ వీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.




