హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చేపట్టిన తెలంగాణ సాధన మహాదీక్ష ముగిసింది. రేపటి తెలంగాణ బంద్కు మద్దతిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు దీక్షలో పాల్గొన్న ఆపార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ మాట్లాడుతూ సోనియా సూత్రదారి ,కిరణ్ పాత్రదారులుగా మారి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని ఆయన ఆరోపించారు.




