Wednesday, 4 November 2026

తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపుమేరకు తెలంగాణ జిల్లాలో బంద్‌ కొనసాగుతుంది.తెలంగాణ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 700 బస్సులు ,నిజామాబాద్‌ జిల్లాలోని 6 డిపోలలోని 660 బస్సులు ,కరీంనగర్‌ జిల్లాలోని 11 డిపోలలోని 940 బస్సులు,వరంగల్‌ జిల్లాలోని 8 డిపోలలోని 900బస్సులు ,మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 8 డిపోల్లో 800 బస్సులు ,ఆదిలాబాద్‌ జిల్లాలోని 6 డిపోల్లో 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *