హైదరాబాద్ : సీమాంధ్రుల వల్ల తెలంగాణ నేతలకు ,ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కలిసుండాలనే ఆలోచన ఉంటే తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌పై దాడిచేసి ఉండేవారు కాదని ఆయన తెలిపారు.ఒక్క తెలంగాణ నినాదం చేసినందుకే చితకబాదడంతో రేపు తెలంగాణ వాళ్లను ఎంత చిత్ర హింసలకు గురిచేస్తారో స్పష్టం చేస్తుందని అన్నారు.తెలంగాణ ప్రజలు లేని సీమాంధ్ర ప్రజలు లేని సీమాంధ్ర జిల్లాలో తాను సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.




