హైదరాబాద్ : నిన్న ఎల్బీస్టేడియంలో జరిగిన సమైక్య సభ అగ్రకుల పెత్తందారుల సభ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.నిన్నటి సభలో దళితులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.సభా వేదికపై దళితులకు తగిన ప్రాధాన్యం లభించలేదని తెలిపారు. నాలుగేళ్లు సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహించిన శ్యామ్యుల్‌ను ఎందుకు మాట్లాడించలేదని ప్రశ్నించారు.డాక్టర్ మిత్రా ,గజల్ శ్రీనివాస్‌తో ఎందుకు మాట్లాడించారని ఆయన ప్రశ్నించారు.




