తెలంగాణ ఏర్పాటు కోసం హోంమంత్రిత్వ శాఖ నోట్‌ పూర్తి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం హోం మంత్రిత్వ శాఖ నోట్‌ తయారుచేసినట్లు పీటీఐ పేర్కొంది.అమెరికా నుంచి సోనియా వచ్చిన తర్వాత నోట్‌ క్యాబినేట్‌ ముందుకు రానుంది.కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ఆదేశాల మేరకు అధికారులు నోట్‌ తయారు చేసినట్లు పీటీఐ పేర్కొంది. ఇక మంత్రిమండలి ముందుకు రావడం మాత్రమే మిగిలింది.