విచారణలో భట్కళ్‌ వెల్లడి!

మంగళూరు: హైదరాబాద్‌లో 2008లో పేల్చిన బాంబుల్ని కర్ణటకలో మండళూరు శావార్లులోని ఓ అపార్టుమెంట్‌లో తయారు చేసినట్లు ఇండియన్‌ మూజాహిదీన్‌ ఉగ్రవాది యాసిన్‌ భట్కళ్‌ విచారణలో వెల్లడించాడు. భట్కళ్‌ ఇటీవల బీహర్‌ నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతా దళాలకు పట్టుబడిన సంగతి తెలిసందే. విచారణ కోసం ఈ నెలారంభంలో అతణ్ని మంగళూరుకు తీసుకొచ్చారు. వివిధ ప్రాంతాల్లో రహస్యంగా తిప్పి సమాచారం సేకరించారు. మంగూళురులోని అతావర్‌ ప్రాంతంలో ఉన్న జెఫ్యా హైట్స్‌ అనే అపార్ట్‌మెంట్‌లోని 301 నెంబరే ఫ్లాట్‌లో అసాదుల్లా అఖ్తర్‌ అనే ఉగ్రవాదితో కలసి బాంబుల్ని తయారు చేసినట్లు భట్కళ్‌ విచారణలో వెల్లడించినట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి.

తాజావార్తలు