అధికారం కోసం పార్టీలు పూటకోమాట : బొత్స
హైదరాబాద్: విభజన విషయంలో అధికారం కోసమే కొన్ని పార్టీలు పూటకో మాట మాట్లాడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. దోచుకున్నది దాచుకోవడానికి మళ్లీ దోచుకోవడానికి, అధికారం కోసమే ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చిన మాట నిలుపుకునే సత్తా కాంగ్రెస్‌కే ఉందని చెప్పారు.



