Wednesday, 4 November 2026

విభజనతో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు:డీఎస్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. సోనియా గాంధీతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా అధిష్టానం ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అధిష్టానానికి లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నింటిని సోనియా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులన్ని సోనియాకు తెలుసన్నారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలు. అపోహలు నివృత్తి చేయడానికి అధిష్టానం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఆంటోని కమిటీ కోర్‌ కమిటీకి ఇవాళ ఓ నివేదిక ఇస్తుందని డీఎస్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *