Tuesday, 3 November 2026

కె.కె తంగాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

దర్పల్లి : నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం నల్లవెల్లిగ్రామంని కె.కె. తాండాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తులు జరిపిన దాడిలో అటవీశాఖ రేంజ్‌ అధికారి గంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన అటవీసిబ్బంది ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం రూరల్‌ డీఎస్పీ అనీల్‌కుమార్‌, నిజామాబాద్‌ డీఎఫ్‌వో బీమానాయక్‌, సీఐలు శ్రీశైలం, శ్రీనివాస్‌ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *