కేంద్ర మంత్రి చిదంబరం బిజీబిజీ
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని టాటా, లాకిడ్ మార్టిన్ కంపెనీలను సందర్శించారు. నువాటెల్ హోటల్‌లో ఐఆర్‌డిఎ రెపాసిటరీ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయినట్టు తెలిసింది.



