ఆశారాంబాపు కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16 : ఆధ్యాత్మిక గురువు ఆశారాంబాపుకు జోధ్‌పూర్‌ కోర్టులో చుక్కెదురైంది. మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ సోమవారంనాడు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా 16 ఏళ్ల బాలికపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆశారాంబాపును సెప్టెంబర్‌ ఒకటో తేదీ అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ఆశ్రమంలో అరెస్టు చేయడం.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జోధ్‌పూర్‌ జైలుకు తరలించడం తెలిసిందే.

 

తాజావార్తలు