విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : ఎపీఎన్జీవోల సమ్మెపై విచారణను మంగళవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. ఎపీ ఎన్జీవోల సమ్మెపై సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఉత్పన్నమయ్యే పరిణామాలేమిటో తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. వివరణలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. ఇదిలా ఉండగా సమ్మె చట్టవిరుద్ధమంటూ గతంలో న్యాయవాది రవికుమార్‌ పిటిషన్‌ వేసిన విషయం విదితమే.

 

తాజావార్తలు