హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఎపిఇఎంఎస్): ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానున్నట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశం జరిగి మూడు నెలలు కావడంతో 19న మంత్రివర్గ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. విభజన నిర్ణయం ప్రకటించిన తర్వాత మంత్రివర్గ సమావేశం జరగనుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.




