రాజీవ్‌గృహకల్ప లబ్దిదారులకు ఊరట
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : రాజీవ్ గృహకల్ప లబ్దిదారులకు ఊరట లభించింది. లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. సభ్యత్వం తీసుకున్న లబ్ధిదారుల నుండి నాలుగు వారాలలోగా రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవాలని.. ఆ తర్వాత నెల రోజులలోగా ఫ్ల్లాట్లను వారికి కేటాయించా లని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సభ్యలుగా చేరి, డబ్బులు చెల్లించినా ఫ్లాట్లను మంజూరు చేయలేదని.. న్యాయం చేయాలని లబ్దిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



