వాషింగ్టన్‌ షిప్‌యార్డ్‌లో కాల్పులు నలుగురు మృతి


వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) :
అమెరికాలోని అమెరికన్‌ నౌకాదళానికి చెందిన వాషింగ్టన్‌ నౌకాదళ యార్డులో ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరిని భద్రతా దళాలు కాల్చి చం పాయి. మిగిలిన దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిసింది. అమెరికన్‌ కాలమానం ప్రకారం ఉదయం 8.20 గంటలకు ఈ ఘట న చోటు చేసు కుం ది. నౌకాదళ యా ర్డులో 3000 మం ది పని చేస్తున్నారు. మృతులపై రక్షణ శాఖ సరైన వివరాలు ఇవ్వలేదు. 10 మందికి గాయాలైనట్లు పోలీసు అధి కారులు చెబుతున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు ఒబామాకు సమాచారం ఇచ్చా మని వారు తెలిపారు.

తాజావార్తలు