బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభమైంది. వేలంపాటను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో బాలాపూర్ భక్తజనసంద్రంగా మారింది. 1994 సంవత్సరంలో తొలి సారిగా బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగింది. అప్పుడు లడ్డూ రూ.450కి పలికింది. గత సంవత్సరం లడ్డూ ప్రసాదం 7.5లక్షలు పలికింది. లడ్డూ ను కొనడానికి భక్తులు పోటీపడుతున్నారు.



