తెలంగాణను ఏ శక్తి అడ్డుకోలేదు

విజయ తీరాలకు చేరుకుంటా
యూటీ అంటే మహా ఉద్యమమే
– కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దన్నారు. మోసపు ప్రకటనలను నమ్మవద్దని కూడా హెచ్చరించారు. తెలంగాణను ఎవరూ ఆపల ేరని, ఇంతదూరం వచ్చాక ఆపుతామనడం మూర్ఖత్వమని ఆయన పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ యూటీ అన్నా మరేది అన్నా ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో మరో పోరాటానికి కూడా వెనాడబోమన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం రెండుసార్లు నిర్ణయం తీసుకుందన్నారు. చంద్రబాబు, విజయమ్మలే రెండురకాలుగా మాట్లాడుతున్నారని, సీమాంధ్ర నేతలు ఢిల్లీకి యాత్రల విూద యాత్రలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.ఈ ఇద్దరూ తెలంగాణ ద్రోహులని అన్నారు. తెలంగాణ ఏర్పాటును సీడబ్ల్యూసీ ప్రకటించగానే సీమాంధ్ర పార్టీలు రంగులు మార్చాయని కేసీఆర్ విమర్శించాయి. ప్రకటన రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, వైఎస్ విజయలక్ష్మిలు మాట మార్చారని దుయ్యబట్టారు. సీమాంధ్రలో రోజుకు నాలుగు వందల కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారని అన్నారు. ఇదేనా కలిసుందామనే నీతి అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరుగుతున్న తరుణంలో ఆపడం మూర్ఖత్వం కాక మరోటి కాదన్నారు. తెలంగాణ విజయం తీరాలకు చేరడం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ హైదారబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరోటి కాదన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి ఒప్పుకోబోమన్నారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగబోదని, విజయ తీరాలకు చేరడం ఖాయమని అన్నారు. ఇవాళ ఆయన నాంపల్లిలోని గహకల్పలో ఏర్పాటు చేసిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఎన్నో ఆటుపోట్లకు ఓర్చుకొని శ్రీనివాస్‌గౌడ్ టీజీవో సంఘాన్ని ముందుండి నడిపించారని కితాబిచ్చారు. ఇలాంటి సభలు చూసినప్పుడు కళ్లలో ఆనందభాష్పాలు వస్తుంటాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆవిర్భావమే నిదర్శనమని కేసీఆర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటు ఇంత దూరం వచ్చినంక కూడా ఆపుతామనడం మూర్ఖత్వమేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆపుతున్నారట కదా అని తనకు ఫోన్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. సీమాంధ్ర డబ్బాలు చూసుడెందుకు? ఆగమవుడెందుకు అని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. ఆంధ్రా పేపర్లు చదవడమెందుకు? టీవీలు చూసుడెందుకు? ఆగమవుడెందుకు అని అడిగారు. ఇంత దూరం వచ్చినంక కూడా తెలంగాణ ఆపుతమంటే వానంత మూర్ఖుడు ఉండడని చెప్పారు. తెలంగాణపై వెనుకకు పోయేదేలేదని స్వయంగా ఆంధ్రోళ్లకే ప్రధానే చెప్పాక ఇంకా ఆగడం అన్నే సమస్యేలేదన్నారు. హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోలు సభలు పెట్టి తెలంగౄణవాదులపైనే దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాము తల్చుకుంటే సభ జరిగేదా అని అన్నారు. జై తెలంగాణ అన్న కానిస్టేబుల్‌ను కొడతారా అని ప్రశ్నించారు. కర్నూలు వెళ్లిన తెలంగౄణ వారిని కొట్టి తిరిగి పంపిస్తారా అని ప్రశ్నించారు. అదే తాము చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవానల్నారు. ఇలాంటి పిచ్చి పనులను సహించబోమన్నారు. కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయంతీసుకున్న తరుణంలో ఎలాంటి అడ్డంకులకు
పాల్పడవద్దన్నారు. పత్రికలు వ్యతిరేక రాతలు సరికాదన్నారు. సీమాంధ్ర నేతలు అన్నీ కావాలని అంటున్నారని, విూది కావాలి, మాది కావాలనే ధోరణి వారిదని ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే ఈ నెల 29న టీ జేఏసీ తలపెట్టిన ‘సకల జనుల భేరీ’ సభకు తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విద్యార్థులు భారీగా తరలిరావాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. త్వరలోనే కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ సభ నిర్వహిస్తుందని తెలిపారు. సీమాంధ్ర నేతలు దోచుకుంటాం, దాచుకుంటాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వారు ఎప్పుడు కట్టు బానిసలుగా ఉండాలన్న రీతిలో సీమాంధ్రులు వ్యవహరించడం తగదన్నారు. అధిష్టానం తెలంగాణ ప్రకటనకు కట్టుబడి తక్షణమే తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసైనా తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు టీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటదని చెప్పారు.



